ఈ రసం తాగితే చాలు... సింపుల్‌గా బరువు తగ్గుతారు
బరువు తగ్గించే రసాలు ఏమిటా అని చాలామంది ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా పాలకూర కీరదోసకాయ రసంతో బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణలు చెపుతున్నారు. ఈ జ్యూస్ తయారు చేసుకునేందుకు కేవలం 10 నిమిషాలు చాలు. రోజుకి ఒకటి లేదా రెండుసార్లు తాగితే చాలు.
కావలసినవి
తరిగిన బచ్చలికూర: 1 బంచ్
ఒలిచిన నిమ్మకాయ ముక్కలు: 1-2
అల్లం పొట్టు తీసి చూర్ణం: 1 అంగుళం
దోసకాయ ముక్కలు: 1-2
ఆకుపచ్చ ఆపిల్ ముక్కలు: 2 పెద్దవి
తేనె: 1 టీస్పూన్
తయారుచేసే పద్ధతి
అన్ని పండ్లు, కూరగాయలు కడగాలి. జ్యూసర్‌లో పదార్థాలను కలపి జ్యూస్ తీయండి. ఆ తర్వాత ఒక జల్లెడ ద్వారా వడపోయండి. ఈ రసాన్ని కాస్త తీపి చేయడానికి తేనె జోడించండి. అంతే.. పాలకూర కీరదోస రసం రెడీ.