1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Husband killed wife in tadipatri

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. ఆపై లొంగిపోయాడు..

Crime
అనంతపురం జిల్లా, తాడిపత్రిలో అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలం, నల్లమేకలపల్లికి చెందిన సుధాకర్... తాడిపత్రి పట్టణానికి చెందిన శ్రీలేఖ (26)ను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల తరచూ భార్యపై అనుమానం వ్యక్తం చేస్తుండేవాడు. ఆమె మరొకరితో మాట్లాడుతుందన్న అనుమానం రోజురోజుకూ బలపడటంతో భార్యకు దూరంగా వుంటున్నారు. 
 
ఏం జరిగిందో కానీ గత రాత్రి తాడిపత్రిలో వున్న శ్రీ లేఖను ఎల్లనూరు రోడ్డు సమీపంలో హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి ముచ్చుకోట అటవీ ప్రాంతంలో పడేశాడు. భార్యను తానే చంపానంటూ పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
తర్వాతి కథనం
Telangana: తెలంగాణలో పడిపోనున్న పగటి ఉష్ణోగ్రతలు.. భారీ వర్షాలకు ఛాన్స్