సోమవారం, 2 అక్టోబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 5 జులై 2022 (19:12 IST)

మామిడి టెంకలో గింజ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

mango
మామిడి పండుతో పాటు దాని టెంక కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళల్లో ఋతుస్రావం తర్వాత 4-5 రోజుల వరకు స్త్రీలు భరించలేని నొప్పిని ఎదుర్కొంటారు. ఈ నొప్పి రాకుండా ఉండేందుకు కొందరు మహిళలు పెయిన్ కిల్లర్స్ కూడా వాడుతుంటారు. మామిడి గింజల నుండి తయారైన పొడి పీరియడ్స్ నొప్పి, రక్తస్రావం రెండింటినీ తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని పెరుగుతో కూడా తినవచ్చు.

 
పంటి నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి చికిత్సలో మామిడి గింజల నుండి తయారైన పొడి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం టూత్‌పేస్ట్‌గా ఉపయోగించవచ్చు. ఇది అన్ని దంత సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

 
బరువును తగ్గించుకోవడానికి మామిడి గింజల పొడిని ఉపయోగించవచ్చు. ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, దీని వల్ల ఎక్కువ కాలం ఆకలిగా అనిపించదు.