బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (21:54 IST)

ఖర్జూరాలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? (video)

ఖర్జూరంలో ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది ఎముకలకు మేలు చేస్తుంది. ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలను కూడా నివారిస్తుంది. ఖర్జూరాన్ని రోజూ తీసుకోవడం వల్ల కంటికి మేలు జరుగుతుంది. దీంతో కంటిచూపు పెరుగుతుంది. ఎందుకంటే ఖర్జూరంలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కళ్లకు మేలు చేస్తుంది.

 
కరోనా కాలంలో రోగనిరోధక శక్తికి శ్రద్ధ ఎక్కువగా తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే మంచి రోగనిరోధక శక్తి ఉన్నవారు మాత్రమే ఈ వ్యాధిని ఎదుర్కోగలరు. ఖర్జూరంలో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్లు ఉన్నాయి. దీంతో శరీరానికి శక్తి అందుతుంది. ఖర్జూరంలో ఉండే ప్రొటీన్ కండరాలను బలపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 
ఖర్జూరంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇందులో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఖర్జూరాన్ని రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇవి కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరంలో పొట్ట కొవ్వును తగ్గించే పీచుపదార్థాలు ఉన్నాయి. ఈ లక్షణాల వల్ల, ఖర్జూరాలు బరువును తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

 
ఖర్జూరంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, డి కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.