సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 14 జులై 2022 (18:32 IST)

ఉల్లిపాయ రసంతో ఈ సమస్యలు తగ్గుతాయి

Onion Juice
కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఉల్లిపాయ రసంలో ఆవాల నూనె కలిపి రాసుకుంటే నొప్పులు నయమవుతాయి. తరిగిన ఉల్లిపాయను మొటిమలు ఉన్న ప్రదేశంలో రుద్దితే మొటిమలు తొలగిపోతాయి.

 
ఉల్లిపాయ రక్తపోటును తగ్గిస్తుంది. కోల్పోయిన శక్తిని పునరుద్ధరిస్తుంది. ఉల్లిపాయ రసంలో కొంచెం ఉప్పు కలుపుకుని తీసుకుంటే రేచీకటి జబ్బు నయమవుతుంది. జలుబు సమయంలో ఉల్లి వాసన పీల్చడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయను చిన్నచిన్న ముక్కలుగా గ్రైండ్ చేసి కొద్ది మోతాదులో తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది.

 
ఉల్లిపాయ రసంలో పంచదార కలిపి తింటే వాతం తగ్గుతుంది. ఉల్లిని దంచి తేలు కుట్టిన ప్రదేశంలో రుద్దితే విషం బయటకు పోతుంది. ఉల్లిపాయ తింటే గొంతు బొంగురుపోవడం పోయి స్వరం మెరుగుపడుతుంది. ప్రతి రోజు మూడు ఉల్లిపాయలు తింటే స్త్రీల సమస్యలు నయమవుతాయి. ఉల్లిపాయలను ముక్కలుగా కోసి నెయ్యిలో వేయించి తింటే మలబద్ధకం తగ్గుతుంది.