1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. You will be surprised to know the medicinal properties of radish

ముల్లంగిలో వున్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

medicinal properties of radish
ముల్లంగిని అంతా చూసే వుంటారు. ఏదో సాంబారులో వేసుకుని తినేస్తుంటారు. ఐతే అందులో వున్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో చూద్దాం. నాలుగు చెంచాల ముల్లంగి రసంలో అరస్పూన్ ఉలవల పొడి, అరస్పూన్ మెంతిపొడిని చూర్ణంలా చేసుకుని రోజు రెండుసార్లు సేవించడం వల్ల మూత్రపిండ, మూత్రాశయలలో రాళ్ళు కరిగిపోతాయి.

 
రెండు, మూడు స్పూన్ల ముల్లంగి ఆకుల రసాన్ని ఉదయం పూట తాగుతుంటే కడుపులోని క్రిములు నశిస్తాయి. నువ్వుల నూనెలో మూడింతల ముల్లంగి ఆకుల రసం కలిపి నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగించి, చల్లార్చి వడకట్టి ఒక సీసాలో ఉంచుకుని అవసరమైనప్పుడు కొద్దిగా వేడి చేసి రెండు మూడు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.

 
ఇటీవల కాలంలో మగవారిలో శృంగార సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. అలాంటివారు ఒక స్పూను ముల్లంగి గింజల్ని ఆవుపాలల్లో వేసి బాగా కాచి చల్లార్చి వడకట్టి ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే సమస్య తగ్గుతుంది. ముల్లంగి గింజల్ని, నీటితో మెత్తగా నూరిన గంధాన్ని గజ్జి, చిడుము, దురద ఉన్న ఆయా బాగాలపై పట్టిస్తుంటే చర్మవ్యాదులు తగ్గుతాయి. 10-20 మి.లీ ముల్లంగి ఆకుల రసంలో తగినంత పంచదార కలిపి రెండుసార్లు సేవిస్తుంటే కామెర్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపే డేంజరస్ ఫుడ్ ఐటమ్స్