1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:38 IST)

మాఘమాసం.. రథ సప్తమి, భీష్మ అష్టమి ఎప్పుడు.. ముల్లంగి తినకూడదా?

మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వున్నాయి. మాఘశుద్ద సప్తమి సోమవారం (ఫిబ్రవరి 7, 2022) వస్తోంది. ఇదే సూర్య సప్తమి లేదా రథసప్తమి అంటారు. తెల్లవారు జామున ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. 
 
ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. అలాగే భీష్మాష్టమి (మంగళవారం) మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. 
 
మాఘ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజున విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.  
 
మాఘమాసంలో చేయాల్సిన చేయకూడని పనులు: కొంతమంది ఈ నెల రోజులు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నువ్వులను, పంచదారను కలిపి తింటారు. నువ్వులను దానమిస్తారు. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.