గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (23:17 IST)

బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచవచ్చా?

బిల్వ వక్షాన్ని పెంచడం ద్వారా అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం ఉంటుంది. శివునికి బిల్వ పత్రాలను  సమర్పిస్తే సర్వపాపాలు తొలగి పుణ్యఫలాలు చేకూరుతాయి. అత్యంత పవిత్రమైన వృక్షంగా బిల్వాన్ని పరిగణిస్తారు. 
 
శివారాధనలో బిల్వ ఆకుతో చేసే పూజ ప్రత్యేకం. మూడు భాగాలతో కూడిన ఈ ఆకు త్రిశూలానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అంటే ఇచ్ఛా శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తికి ఇది నిదర్శనం. 
 
బిల్వార్చనతో వేలాది మందికి అన్నదానం చేసిన ఫలితం దక్కుతుంది. గంగానది వంటి పుణ్యనదులలో స్నానం చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. బిల్వార్చనతో 108 శివాలయాలను దర్శించిన ఫలితం దక్కుతుంది. 
 
బిల్వ వక్షం నుంచి వీచే గాలిని పీల్చడం ద్వారా లేదా దాని నీడను మన శరీరంపై వేయడం ద్వారా అధిక శక్తి లభిస్తుంది. శివునికి ఈ బిల్వ పత్రాలను సమర్పించి, నమస్కరించడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు. 
 
బిల్వ చెట్టును ఆరాధించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. ఇంట్లో తులసిలా బిల్వ వృక్షాన్ని పెంచడం ద్వారా నరకబాధల నుంచి తప్పుకోవచ్చు. బిల్వ పత్రాలతో శివుని పూజతో మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.