గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: సోమవారం, 31 జనవరి 2022 (21:49 IST)

01-02-2022 నుంచి 28-02-2022 వరకూ మీ మాస ఫలితాలు

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం గ్రహాల సంచారం అనుకూలిస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తరుణం కాదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమార్పు అనివార్యం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. వేడుకల్లో పాల్గొంటారు.

 
వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రముఖుల సందర్శనం అనుకూలిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. గృహ మరమ్మతులు చేపడతారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు సమయపాలన, ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

 
మిధున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్దికి ఓర్పు ప్రధానం. పట్టుదలతో శ్రమించండి. త్వరలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో మెలకువ వహించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా వుంటుంది. పనులతో సతమతమవుతారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్థానచలనం. ప్రయాణం తలపెడతారు.

 
కర్కాటక రాశి: పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతారు. ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతాయి. మీ సమర్థత మరొకరికి కలిసి వస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఆప్తుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.

 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం వుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. తొందరపడి హామీలివ్వవద్దు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు తప్పవు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.

 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థిక లావాదేవీలతో తీరిక వుండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఖర్చులు అదుపులో వుండవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం దూకుడు అదుపుచేయండి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. పందాలు, జూదాలు జోలికిపోవద్దు.

 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం శుభదాయకం. వేడుకలు, వినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లావాదేవీలతో తీరిక వుండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. సంతకాలు, చెల్లింపుల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉపాధి అవకాశాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. వైద్య, సేవా సాంకేతిక రంగాలవారికి ఆదాయాభివృద్ధి.

 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
వ్యవహారాను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పత్రాలు అందుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.

 
ధనుస్సు రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం ద్వితీయార్థం బాగుంటుంది. ఆర్థికంగా పురోగమిస్తారు. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా వుంటుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.

 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంతమాత్రమే. ఏ విషయంపై ఆసక్తి వుండదు. నిస్తేజానికి లోనవుతారు. ఒత్తిడి తగ్గించుకోండి. అతిగా ఆలోచింపవద్దు. ఆప్తులతో గడిపేందుకు యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం, చికాకులు అధికం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.

 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. యత్నాలు కొనసాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఆకస్మిక స్థానంచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.

 
మీనరాశి: పూర్వాబాధ్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికంగా పురోగమిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. సమస్యలను దీటుగా ఎదుర్కొంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.