రాత్రి పడుకునే ముందు ఓ యాలుక్కాయ తీసుకుంటే....
సుగంధ ద్రవ్యాలలో ఒకటైన యాలకులు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే ముఖ్యమైన విటమిన్లను కలిగి ఉంటాయి. యాలకులు తీసుకోవడం ద్వారా ముఖంపై వృద్ధాప్య ప్రభావం తక్కువగా కనిపిస్తుంది. వీటిని తీసుకుంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూస్తే... గొంతులో ఇబ్బంది, గొంతు నొప్పిగా ఉంటే, ఉదయం లేచేటప్పుడు- రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఓ యాలుక్కాయ నమిలి గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల మీ గొంతు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
ఎప్పుడైనా ఎక్కిళ్ళు వస్తే... కొన్నిసార్లు అది ఆగకుండా అలాగే వస్తూ వుంటే ఓ యాలుక్కాయను బుగ్గన పెట్టుకుని చప్పరించాలి. ఇలా చేయడం వల్ల ఎక్కిళ్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఏలకులు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఏలకులు తీసుకోవడం ద్వారా రక్తపోటు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శ్వాసలోంచి వచ్చే దుర్వాసన కూడా పోతుంది.