1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (13:16 IST)

ఇలా చేస్తే బ్యూటీ పార్లర్లకు పరుగులెత్తాల్సిన అవసరం లేదు..

beauty
ముఖం కాంతివంతంగా మార్చుకునేందుకు ఇక బ్యూటీ పార్లర్లకు పరుగులెత్తాల్సిన పనిలేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు. 
 
క్లెన్సర్- పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే జిడ్డు వదిలిపోతుంది. తరచూ చేస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది. 
 
అలాగే ఒక టీస్పూన్ నారింజ రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేసుకుని.. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత తడి టిష్యూతో తుడిచేయాలి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు చర్మకాంతి పెరుగుతుంది. 
 
ఇకపోతే.. టేబుల్ స్పూన్ మినపప్పు, ఐదారు బాదం పప్పుల్నిరాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. గంట తర్వాత కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.