ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 జూన్ 2022 (19:26 IST)

మేకప్ ప్రేమికుల కోసం తమ మొట్టమొదటి బ్యూటీ బ్రాండ్ ఇక్సు (IKSU)ను ప్రకటించిన లైఫ్‌స్టైల్

IKSU
భారతదేశపు సుప్రసిద్ధ షాపింగ్ కేంద్రం, లైఫ్‌స్టైల్, తమ మొట్టమొదటి బ్యూటీ బ్రాండ్ ఇక్సు (IKSU)ను మేకప్ ప్రేమికుల కోసం విడుదల చేసింది. అందుబాటు ధరలలో విస్తృత శ్రేణి ఉత్పత్తులు కలిగిన ఇక్సు, స్వీయ ప్రేమ సందేశంతో మరింత మంది మహిళలను చేరుకోవడం లక్ష్యంగా చేసుకుంది. జంతు హింస చేయకుండా, సల్ఫేట్స్, పారాబెన్స్ వాడకుండా ఇక్సు ఉత్పత్తులు రూపొందించారు. ప్రయాణాలను అధికంగా చేసే మహిళల కోసం ఈ బ్రాండ్‌ను సృష్టించారు. సాధికారిత, ఆత్మవిశ్వాసం కలిగి క్షమాపణ కోరని రీతిలో ఉండాలని తలిచే మహిళల కోసం ఇక్సు ఉంది.

 
మేకప్‌ అనేది ఓ అందమైన కళ, స్వీయ వ్యక్తీకరణ అనే నమ్మకంతో, ఇక్సు ఇప్పుడు విస్తృత శ్రేణిలో  బ్యూటీ ఉత్పత్తులను పరిచయం చేసింది. ఇవి ప్రతి బ్యూటీ ప్రేమికురాలి అవసరాలను తీరుస్తాయి. ఈ మహిళల జీవితంలో ప్రేమ, అందం యొక్క ఆవశ్యకత ను ఇక్సు గుర్తించింది. అందువల్ల, ఎలాంటి తీర్పు లేకుండా ఆరోగ్యవంతమైన రీతిలో స్వీయ ప్రేమలో మునిగిపోయేలా వారిని ప్రోత్సహిస్తుంది. ట్రెండీగా ఉండే ఉత్పత్తులను కోరుకునే నేటి తరపు మహిళలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఉత్పత్తులనూ తీర్చిదిద్దారు. ఇక్సుతో, నాణ్యత, లభ్యత అనేవి ఒకే చోట సౌకర్యవంతంగా పొందవచ్చు. ఈ బ్రాండ్‌ విస్తృత శ్రేణిలో  ఫేస్‌ ప్రొడక్ట్స్‌ను వీటిలో అందిస్తుంది. వీటిలో ఫౌండేషన్స్‌, కన్సీలియర్స్‌, బ్లష్‌లు, హైలైటర్స్‌ ఉన్నాయి. ఈ శ్రేణిలో నేత్ర సంబంధిత ఉత్పత్తులలో ఐ లైనర్లు, కోల్‌ పెన్సిల్స్‌తో పాటుగా లిప్‌స్టిక్సతో ప్రకాశవంతమైన షేడ్స్‌ మరియు రంగు రంగుల నెయిల్‌ పెయింట్స్‌ కేవలం 99 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తాయి. ప్రతిఒక్కరికీ ఇక్సు వద్ద ఒకటుంది.

 
లైఫ్‌స్టైల్‌ ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, దేవరాజన్‌ అయ్యర్‌ మాట్లాడుతూ, ‘‘లైఫ్‌స్టైల్‌ యొక్క మొట్టమొదటి మేకప్‌ బ్రాండ్‌ ఆవిష్కరణతో మొట్టమొదటిసారిగా బ్యూటీ విభాగంలో ప్రవేశిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. తమ అందాన్ని వ్యక్తీకరించడంతో పాటుగా వేడుక చేయాలని కోరుకునే మహిళల కోసం ఇక్సు ఉంది. వినియోగదారులు ఇక్సు శ్రేణి ఉత్పత్తుల నుంచి అత్యున్నత నాణ్యత, అందుబాటు ధరలను ఆశించవచ్చు. ఇక్సు ఆవిష్కరణతో, ఫుట్‌వేర్‌, యాక్ససరీలు, బ్యూటీ నుంచి అప్పెరల్‌ వరకూ లభించే ఏకీకృత కేంద్రంగా లైఫ్‌స్టైల్‌ నిలువనుంది’’ అని అన్నారు