ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (14:38 IST)

విశాఖపట్నంలో మిల్లెట్ ఇడ్లీలు.. ఆ యువకుడు అలా సక్సెస్ అయ్యాడు..

Millet Idli
Millet Idli
తమిళనాడులో ఇడ్లీల బామ్మ సంగతి తెలిసిందే. ఈమె చాలా తక్కువ ధరకే ఇడ్లీలు అమ్ముతూ వార్తల్లో నిలిచింది. తాజాగా విశాఖలో మిల్లెట్ ఇడ్లీల అమ్మకంపై చర్చ సాగుతోంది.

విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని చిట్టెం సుధీర్ మిల్లెట్ ఇడ్లీలు అమ్ముతూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. వసెన పోలి అనే పేరుతో ఈ షాపు నడుస్తోంది.

2018లో ఇతని ఇడ్లీ స్టాల్ మొదలైంది. రూ.50వేల పెట్టుబడితో ఈ షాపు ప్రారంభమైంది. కొర్రలు, సామలు వంటి ఎనిమిది రకాల చిరు ధాన్యాలతో తయారు చేసిన ఇడ్లీలను ఇతడు కస్టమర్లకు అందిస్తున్నాడు. 
 
ఈ ఇడ్లీలతో పాటు సాధారణ వేరుశెనగ చట్నీ కాకుండా పొట్లకాయ, అల్లం, క్యారెట్ వంటి కూరగాయల నుండి చట్నీలు అందిస్తున్నాడు. చిట్టెం మిల్లెట్ ఇడ్లీలలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, రాగి వంటి గొప్ప ఖనిజ లక్షణాలు ఉంటాయి.
 
నోటి మాట ద్వారానే వైజాగ్‌లోని ఈ ఇడ్లీ షాపు బాగా పాపులర్ అయ్యింది. రోజుకు 500 ప్లేట్‌లను విక్రయిస్తాడు. వారాంతాల్లో, సెలవు దినాల్లో, ఈ సంఖ్య సులభంగా 600కి చేరుకుంటుంది. డిమాండ్ ఉన్నప్పటికీ, అతను ఇడ్లీలను అందుబాటులోని ధరలో ఉంచాడు. 
 
ఒక ప్లేట్ మూడు ఇడ్లీలు మరియు ధర రూ. 50. సింగిల్ పీస్ రూ. 17లుగా అమ్ముతున్నాడు. ఈ చిరు ధాన్యాలను అతడు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి అగ్రో ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.
 
ఉద్యోగంలో చేరే బదులు సహజ వ్యవసాయాన్ని ప్రారంభించేందుకు ఈ కోర్సు అతనికి స్ఫూర్తినిచ్చింది. దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆహారాలలో ఇడ్లీ ఒకటి కాబట్టి తన మిల్లెట్ ఇడ్లీలను అమ్మాలని డిసైడయ్యాడు సక్సెస్ అయ్యాడు.