ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (11:25 IST)

విశాఖపట్నం: అగ్గిపెట్టెల లారీలో అగ్నిప్రమాదం

విశాఖపట్నంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెందుర్తి ఆనందపురం దగ్గర ప్రమాదవశాత్తు ఓ అగ్గిపెట్టెల లారీలో అగ్ని ప్రమాదం సంభవించింది.

దీంతో లారీలో భారీగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం కారణంగా సుమారు 4 కిలోమీటర్ల మేరకు వాహనాలన్నీ నిలిచిపోయాయి. 
 
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరుగగానే లారీ డ్రైవర్‌, క్లీనర్‌లు అప్రమత్తమై ప్రాణాలను కాపాడుకున్నారు.