గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (12:08 IST)

పహాడీషరీఫ్‌లో లారీ డ్రైవర్‌పై కాల్పులు

హైదరాబాద్ నగరంలో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించింది. నగరంలోని పహాడీషరీఫ్‌లో ఓ లారీ డ్రైవర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న విలువైన ఆభరణాలు, డబ్బును దోచుకుని పారిపోయారు. లారీ డ్రైవర్‌ను భయపెట్టి రూ.44 లక్షల విలువైన టైర్లను అపహరించుకుని పారిపోయారు. 
 
డ్రైవర్‌పై కాల్పులు జరిపి లారీని అపహరించిన దుండగులు... ఆ తర్వాత టైర్లు అన్నింటినీ గోదాంలో డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత డ్రైవర్‌ను వదిలిపెట్టి ముఠా పారిపోయింది. దీనిపై లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. పహాడీషరీఫ్‌లో లారీ డ్రైవర్‌పై కాల్పులు