1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (17:13 IST)

జనగణమన తర్వాత ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయనున్న పూరిజగన్నాధ్

Purijagannadh
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ `లైగర్` చిత్రీకరణను పూర్తిచేశారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
పూరి స్వయంగా ప్రకటించినట్లు  తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన`ని హోమ్ ప్రొడక్షన్ పూరి కనెక్ట్స్ బ్యానర్లో చేయబోతున్నాడు. `జనగణమన` కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందనుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే `జనగణమన` తర్వాత  ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్  చేయనున్నారు పూరి జగన్నాధ్. 
 
ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు ప్రస్తుతానికి వెల్లడించనప్పటికీ ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ 
పూరి కనెక్ట్స్ పతాకంపై రూపొందనుంది. ఛార్మి కౌర్తో కలిసి పూరి జగన్నాధ్ ఈ సినిమాలన్నింటినీ నిర్మించనున్నారు.
 
ఈ రెండు ప్రాజెక్ట్ల స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి చేసిన పూరి జగన్నాధ్ రాబోయే సంవత్సరాల్లో ఆ సినిమాలను రూపొందించనున్నారు.