శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (08:39 IST)

సాంప్ర‌దాయ లుక్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ ఎందుకు రాలేదు!

LIger team with balakrishna
సంక్రాంతి అంటే తెలుగు సాంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు తెలిసిందే. నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న `అన్ స్టాప‌బుల్‌`లో తెల్ల‌టి లుంగీతో సంక్రాంతికి ఆహాలో ప‌లుక‌రించ‌నున్నారు. ప్ర‌ముఖుల ఇంట‌ర్వ్యూల‌ను చేస్తున్న ఆయ‌న ఈ సంక్రాంతికి లైగ‌ర్ టీమ్‌తో చిట్ చాట్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న క‌ట్టుబొట్టు బాగుంద‌ని నెటిజ‌న్లు కితాబిస్తున్నారు. అయితే  విజ‌య్‌దేవ‌ర‌కొండ కూడా అలా వ‌స్తే బాగుండేది అంటూ కామెంట్లుకూడా వ‌స్తున్నాయి. త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో ఇటువంటి ప్రోగ్రామ్‌లు జ‌రిగితే త‌ప్ప‌నిస‌రిగా వారి క‌ట్టుబాట్ల‌తో వ‌చ్చేవారని విజ‌య్‌కు నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మ‌రి వారికి స‌మాధానం రేపు 14న చెపుతాడేమో చూడాలి.
 
జ‌న‌వ‌రి 14న టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్‌కు ప్రోమో ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. అంద‌రూ న‌మ‌స్కారం పెడుతూ వున్న మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లయింది. ఈ సంక్రాంతికి విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, చార్మి, పూరీ జ‌గ‌న్నాథ్ లు ఏమి చేస్తారో, గ‌తంలో ఏమి చేసేవారో వంటి విష‌యాలు ఆస‌క్లిక‌రంగా చెప్ప‌నున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రోగ్రామ్ బాగా పాపుల‌ర్ అయింది. బాల‌కృష్ణ యాంక‌ర్ అన‌గానే మొద‌ట్లో అంద‌రూ భ‌య‌ప‌డ్డారు. కానీ వారి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఆయ‌న ఈ కార్య‌క్ర‌మం డీల్ చేయ‌డం విశేషం.