ఆలోచనలో విజయ్ దేవరకొండ  
                                       
                  
				  				   
				   
                  				  Vijay Devarakonda with his pet
ప్రస్తుతం విజయ్ దేవరకొండ  కింకర్తవ్యం ఏమిటి? అని ఆలోచిస్తున్నట్లు ఫొటోను పోస్ట్ చేశారు. ఇంటిలో వుంటూ ఛిల్ అంటూ అభిమానులతో తన ఆలోచనను పాలుపంచుకున్నారు. ఇందుకు కారణం కరోనా మూడోవేవ్ ఒమిక్రాన్. ఈ వైరస్ వల్ల నార్త్‌లో గందరగోళంగా వుంది. చాలా చోట్ల కర్ఫ్యూలాంటి వాతావరణం నెలకొంది. దాంతో ముంబైలో విజయ్ దేవరకొండ  నటిస్తున్న లైగర్ సినిమాకు బ్రేక్ పడింది.
	 
	ఇప్పటికే మొదటిసారి కరోనాకు భారీగా గేప్ వచ్చింది. గతంలో కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడడమే కాకుండా షూటింగులు సైతం ఆగిపోయాయి. ఇక చాలా సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదు. తాజాగా మళ్ళీ అదే పరిస్థితి ఎదురు కాబోతోంది. దాంతో లైగర్ పై ప్రభావం చూపింది.
				  
	 
	విజయ్ దేవరకొండ కూడా తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పెంపుడు కుక్కతో కలిస్ పైకి చూస్తూ వున్నఫొటో పెట్టి “స్పష్టంగా మరొక తుఫాను. షూటింగ్ రద్దు అయ్యింది” అంటూ పోస్ట్ చేశాడు. మరలా ఎప్పుడు షూటింగ్ అనేది తెలియజేస్తానని పేర్కొన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కన్నడ, తమిళ, మలయాళంలో కూడా డబ్ చేయనున్నారు.