గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (13:40 IST)

ప్రేమ విఫలం : నాచారంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని నాచారంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నాచారంలోని తన ఇంట్లోనే ఆయన ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడిని తేజావత్ రాజుగా గుర్తించారు. ఈయన మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వం దవాఖానాకు తరలించారు. కాగా, కానిస్టేబుల్ రాజు ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తుంది.