సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:53 IST)

హైదరాబాద్‌లో వలిమై ప్రిరిలీజ్ ఈవెంట్...

అగ్ర హీరో అజిత్ కుమార్ నటించిన వలిమై చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు వరుసగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, సోమవారం రాత్రి బెంగుళూరులో ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ జరుగగా, మంగళవారం రాత్రి ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ జరుపనున్నారు. 
 
హెచ్.వినోద్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ హీరోయిన్. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ఇందులో ప్రతి నాయకుడుగా నటించారు. పూర్తిగా హై యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్ జానర్‌లో బైక్ రేసింగ్ నేపథ్యలో ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఒక్క తమిళనాడులో మినహా బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో నిర్వహిస్తున్నారు. దీనికి కారణం కోలీవుడ్‌లో అజిత్ కుమార్ అగ్ర హీరోగా ఉన్న విషయం తెల్సిందే. పైగా, అజిత్ సినిమా కోసం ఆయన అభిమానులు గత రెండేళ్లుగా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.