ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 10 మే 2022 (18:21 IST)

ఎలాంటి జీవనశైలి మార్పులు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి?

blood pressure
ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అవి ఈ క్రింది విధంగా వుండేట్లు చూసుకోవాలి. బరువు తగ్గడం, శారీరకంగా చురుకుగా ఉండటం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, ఆహారంలో సోడియం తగ్గించడం, మద్యం, పొగాకు- మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా వుండటం. తగినంత నిద్ర పోవడం. 

 
ఈ జీవనశైలి మార్పులు చేసినప్పటికీ రక్తపోటును తగ్గించలేకపోతే?
కొన్నిసార్లు జీవనశైలి మార్పులు మాత్రమే అధిక రక్తపోటును నియంత్రించలేవు, తగ్గించలేవు. ఆ సందర్భంలో, వైద్యుడు రక్తపోటు మందులను సూచించవచ్చు.

 
రక్తపోటు మందులు ఎలా పని చేస్తాయి?
రక్తపోటును తగ్గించడానికి రక్తపోటు మందులు వివిధ మార్గాల్లో పనిచేస్తాయి, యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ (ఎసిఇ) ఇన్హిబిటర్లు, యాంజియోటెన్సిన్ 2 రిసెప్టర్ బ్లాకర్స్ (ఎఆర్బి) రక్త నాళాలు ఎక్కువగా కుంచించుకుపోకుండా ఉంచుతాయి. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కాల్షియం గుండె, రక్త నాళాల కండరాల కణాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి.

 
మూత్రవిసర్జన శరీరం నుండి అదనపు నీరు, సోడియం(ఉప్పు)ను తొలగిస్తుంది. ఇది రక్తంలో ద్రవం మొత్తాన్ని తగ్గిస్తుంది. బీటా బ్లాకర్స్ గుండె నిదానంగా, తక్కువ శక్తితో కొట్టుకోవడంలో సహాయపడతాయి. దీని అర్థం మీ గుండె మీ రక్తనాళాల ద్వారా తక్కువ రక్తాన్ని పంపుతుంది. బీటా బ్లాకర్‌లు సాధారణంగా బ్యాకప్ ఎంపికగా మాత్రమే ఉపయోగించబడతాయి.