1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (22:50 IST)

అధిక రక్తపోటు వచ్చిందని ఎలా తెలుసుకోవడం?

రక్తపోటు చాలా ఎక్కువగా ఉంటే, వాటితో సహా కొన్ని లక్షణాలు కనబడవచ్చు. అలాంటి లక్షణాలు కనబడినప్పుడు ఎంతమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం.
 
తీవ్రమైన తలనొప్పి.
ముక్కు నుంచి రక్తం కారడం.
అలసట లేదా గందరగోళం.
దృష్టి సమస్యలు.
ఛాతి నొప్పి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
క్రమంగా లేనటువంటి హృదయ స్పందన.
మూత్రంలో రక్తం.

 
రక్తపోటును తగ్గించడానికి చేయగలిగే జీవనశైలి మార్పులు
అదనపు కేలరీలను శరీరంలోకి రాకుండా వుండే ఆహారం తీసుకోవాలి.
నడుము చుట్టూ కొవ్వు చేరకుండా చూసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం.
ఆరోగ్యకరమైన ఆహారం
ఆహారంలో సోడియం తగ్గించాలి.
మద్యం అలవాటు వుంటే పరిమితంలో తీసుకోవాలి.
ధూమపానం వదిలేయాలి.
కెఫిన్‌ను తగ్గించాలి.
ఒత్తిడిని తగ్గించుకోవాలి.