ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 17 జూన్ 2022 (23:05 IST)

ముఖం మృదువుగా అందంగా వుండాలంటే ఇలా చేయాలి

ముఖం మృదువుగా అందంగా వుండాలంటే ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది. మెంతులు బాగా నూరి ముఖానికి మర్దన చేసుకుని, గంట తర్వాత స్నానం చేస్తే ముఖం చాలా మృదువుగా, అందంగా ఉంటుంది. పాదాలకు నిమ్మరసాన్ని రాసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే పాదాలకు అంటుకున్న మురికిపోయి శుభ్రంగా ఉంటాయి. 

 
రాత్రి నిద్రపోయేముందు నెయ్యిని ముఖానికి బాగా మర్దనం చేసి ఉదయం కడుక్కోండి. ఇలా చేస్తే మీ ముఖానికి మంచి రంగు రావడంతో పాటు నునుపుదనంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

 
మీ శరీర కాంతి పెరగాలంటే రోజూ రెండు ముల్లంగి దుంపలు తినండి. రోజుకు రెండు దుంపలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పచ్చివి తింటూవుంటే మీ శరీర కాంతి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.