బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 1 జూన్ 2022 (22:52 IST)

బీట్ రూట్ బ్యూటీ, ఫేస్ క్రీమ్ ఎలా చేయాలంటే?

బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా మేలు చేస్తుంది. ముఖంలో మెరుపు, అందం కోసం మహిళలు అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ మార్కెట్లో లభించే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఉండటం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అందుకే సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా అందాన్ని కాపాడుకోవాలి. బీట్‌రూట్ అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో సాయం చేస్తుంది. బీట్ రూట్ ఫేస్ క్రీమ్‌ను ఇంట్లోనే తయారుచేసుకునే మార్గాన్ని చూద్దాం.

 
చిన్న బీట్‌రూట్ తీసుకోండి. టీస్పూన్ - అలోవెరా జెల్, టీస్పూన్ - విటమిన్ ఇ, స్పూన్ - గ్లిజరిన్, టీస్పూన్ - రోజ్ వాటర్ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. క్రీమ్ చేయడానికి, మొదట బీట్‌రూట్‌ను శుభ్రంగా కడగండి. తరవాత తురుము వేసి దాని రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌లో అలోవెరా జెల్ కలపాలి.

 
అందులో విటమిన్ ఇ క్యాప్సూల్, గ్లిజరిన్- రోజ్ వాటర్ కలపండి. ఈ మిశ్రమాన్ని తెల్లగా అయ్యేవరకు కలపాలి. ఆ తర్వాత దానికి 4-5 చిన్న చెంచాల బీట్‌రూట్ రసం కలపండి. అది క్రీమీగా మారినప్పుడు, దానిని పాత్రలో నింపి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. ఇక ఈ క్రీమ్‌ను 15 రోజుల వరకూ ఉపయోగించవచ్చు.