శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (15:32 IST)

అడ్వాన్స్‌డ్ గ్రో హెయిర్ క్లినిక్‌ని ప్రారంభించిన నటి ఉమా రియాజ్ ఖాన్

Gro Hair Clinic inaguration
చెన్నై నగర శివారు ప్రాంతమైన తాంబరం, సేలయూరులో అడ్వాన్స్‌డ్ గ్రో హెయిర్ క్లినిక్‌ని నటుడు రియాజ్ ఖాన్, నటి ఉమా రియాజ్ ఖాన్, శరన్వేల్ జయరామన్, గోమతి శంకర్ ప్రారంభించారు. 
 
అడ్వాన్స్‌డ్ గ్రో హెయిర్, వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తమ 4వ శాఖను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ క్లినిక్ హెయిర్ రీగ్రోత్ బ్రాండ్. ఇది అధిక నాణ్యత సేవ, సాంకేతిక ఆవిష్కరణలు, చికిత్సల ద్వారా సరసమైన వెల్నెస్ హెయిర్ రిగ్రోత్‌పై బలమైన ప్రేరణనిస్తుందని వారు తెలిపారు.
 
హెయిర్ లాస్, రీగ్రోత్ కోసం పూర్తి యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదించిన, అధునాతన చికిత్సతో పరిష్కారాన్ని అందించారు. పర్-కటానియస్ ఎఫ్‌ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, పీఆర్పీ ప్రో ప్లస్, లేజర్ హెయిర్ థెరపీ, అడ్వాన్స్‌డ్ గ్రో-హెయిర్ కాస్మెటిక్ సిస్టమ్, మరెన్నో క్లినికల్ మరియు నాన్-క్లినికల్ చికిత్స విధానం ఇక్కడ అందుబాటులో వుంది.
Gro Hair Clinic inaguration
 
ఈ క్లినిక్ ఈస్తటిక్ మెడిసిన్ రంగంలో ప్రపంచ స్థాయి నిపుణులచే నిర్వహించబడే పేటెంట్ పొందిన హై ఎండ్ మెషినరీలతో బాగా అమర్చబడి ఉంది. ఈ శాఖను నటుడు రియాజ్ ఖాన్, నటి శ్రీమతి ఉమా రియాజ్ ఖాన్‌లు బ్రాండ్ ఓనర్ శరణ్‌వేల్ జయరామన్ ఫ్రాంచైజీ ఓనర్ గోమతి శంకర్, క్లినిక్‌లోని ఇతర సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు.
 
అడ్వాన్స్‌డ్ గ్రో హెయిర్ క్లినిక్ మైక్రో బ్లేడింగ్, లిప్ పిగ్మెంటేషన్, ఐ లాష్ ఎక్స్‌టెన్షన్, లాష్ లిఫ్ట్, లామినేషన్, లేజర్ థెరపీలు వంటి కొన్ని ప్రీమియం సౌందర్య చికిత్సలను కూడా అందిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ క్లినిక్ చెన్నై 73, తాంబరం, సేలయూరు, మొదటి అంతస్తు, 54, వేలచేరి రోడ్, ఎళిల్ నగర్‌ అనే చిరునామాల ఉంది.