ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (07:25 IST)

దిగ్గజ సినీ దర్శకుడు తాతినేని రామారావు ఇకలేరు

tatineni ramarao
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దిగ్గజ సినీ దర్శకుడు తాతినేని రామారావు ఇకలేరు. ఆయన వయసు 84 యేళ్లు. తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన్ను చెన్నై పోరూరులోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, బుధవారం కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగులో అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ వంటి హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే, అమితాబ్, రజనీకాంత్, ధర్మేంద్రం, రాజేష్ ఖన్నా, గోవిందా, అనిల్ కపూర్ సంజయ్ దత్ వంటి అగ్ర నటులతో ఆయన సినిమాలు చేశారు. 
 
ఎన్టీఆర్ ఆయన తీసిన "యమగోల", కృష్ణతో "పచ్చని సంసారం", శోభన్ బాబుతో "జీవనతరంగాలు" మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈయనకు భార్య తాతినేని జయశ్రీ, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో బుధవారం జరుగనున్నాయి.