1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Achennaidu fires on CM jagan Government

ఏపీ సర్కారుపై అచ్చెన్నాయుడు ఫైర్..

Achennaidu
ఏపీ సర్కారుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి జనంపై మోయలేని భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
టిక్కెట్ పై రూ.10 పెంచిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అని ఆయన అడిగారు. ప్రయాణికులపై భారం మోపనని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
 
డీజిల్ ధరలు పెరిగాయనే సాకుతో ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ వాడుతున్న డీజిల్ పై పన్నులు వెనక్కి తీసుకుని ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు. 
 
డీజిల్‌పై అన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించాయని, ఏపీలో మాత్రం పెరుగుతోందన్నారు. డీజిల్ ధరలు పెరిగాయనే సాకుతో ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. పాలన చేతకాకపోతే సీఎం జగన్ దిగిపోవాలన్నారు.  
 
మద్యంపై రూ.12వేల కోట్లు దోచుకున్నారు‌. కరెంటు రేట్లు విపరీతంగా పెంచారు. దేశ చరిత్రలో ఇన్ని దొంగ పన్నులు ఎప్పుడూ చూడలేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం జగన్