1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. CM Jagan two days tour in kadapa

రెండు రోజుల పాటు కడపలో సీఎం జగన్ పర్యటన

ys jagan
కొత్త మంత్రులతో ఏపీ కేబినెట్ కళకళలాడిపోతోంది. మంగళవారంతో దాదాపు మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు. కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 15, 16 తేదీల్లో కడప జిల్లాలో పర్యటిస్తారు. 
 
ఈ సందర్భంగా ఒంటిమిట్టలో జరిగే కోదండరాముని కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. 15వ తేదీ ఒంటిమిట్టలోని కార్యక్రమం అనంతరం.. అదే రోజు రాత్రి కడపకు చేరుకుని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో ఉంటారు.
 
రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం 9 గంటలకు ఎన్జీవో కాలనీలో ఐఏఎస్ అధికారి మౌర్య వివాహానికి హాజరవుతారు. 
 
అనంతరం ఆదిత్య కళ్యాణమండపంలో మేయర్ సురేష్ బాబు కుమార్తె ముందస్తు వివాహా వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కడప విమానాశ్రయం చేరుకుని కర్నూలు జిల్లాకు సీఎం వెళ్తారు. 
తర్వాతి కథనం
ఏపీ మంత్రిగా తెలంగాణ బిడ్డ.. ఆరోగ్య శాఖా మంత్రిగా రజని