ఆదివారం, 11 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (13:59 IST)

ఏపీ మంత్రిగా తెలంగాణ బిడ్డ.. ఆరోగ్య శాఖా మంత్రిగా రజని

Rajani
Rajani
తెలంగాణ బిడ్డ ఏపీ మంత్రి అయ్యారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా విడదల రజని ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కుమార్తే రజని. దాదాపు 4 దశాబ్దాల క్రితం సత్తయ్య బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లి సఫిల్‌గూడలో ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె అయిన రజని ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన రజని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడామెకు ఏపీ కేబినెట్‌లో చోటుదక్కింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలు ఆమెకు కేటాయించారు.