శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-04-22 బుధవారం రాశిఫలాలు - గాయిత్రీ మాతను ఆరాధించిన శుభం..

Karkataka Rashi
మేషం :- బంధువుల కోసం అధికంగా ధనం వ్యయం చేస్తారు. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. నూతన వ్యాపారాలు, వృత్తులు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవటానికి కష్టపడాలి. హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
వృషభం :- దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఫైనాన్సు, వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితిలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. ఆత్మీయులను విమర్శించుట వలన సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కానరాగలదు.
 
మిథునం :- ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కళత్ర పట్టుదల, సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు. రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.
 
కర్కాటకం :- ఊహించని ఒత్తిడి, చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. దైవ సేవా కార్యాక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
సింహం :- ఆదాయ వ్యయాలలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసరం. మార్కెటింగ్ రంగాల వారికి, ఉపాధ్యాయులకు మార్పులు అనూలిస్తాయి.
 
కన్య :- యాదృచ్చికంగా మిత్రులతో కలసి ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ప్రేమికులలో నూతనోత్సాహం కానవస్తుంది. అవివాహితులకు శుభదాయకం. ఇతరులను అతిగా విశ్వసించటం వల్ల నష్టపోయే ప్రమాదముంది. బంధువులకు ధనం ఇచ్చినా తిరిగి రాజాలదు.
 
తుల :- స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. బ్యాంకింగ్ రంగంలోని వారికి పనిభారం, ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం :- భార్యా, భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వైద్యరంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. పెంపుడు జంతువులపట్ల మెళుకువ అవసరం. ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
ధనస్సు :- స్త్రీలు ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వలన ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సంతానం పై చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
మకరం :- ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకా లెదురవుతాయి. ముఖ్యలతో ఆంతరంగిక విషయాలను చర్చిస్తారు. వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల తోడ్పాటు లభిస్తుంది. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు.
 
కుంభం :- ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. వాహనం అమర్చు కోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దైవ, పుణ్యకార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. ప్రియతములకోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళుకువ చాలా అవసరం.
 
మీనం :- ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికం. ముఖ్యల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ప్రగతి పథులోనడుస్తాయి.