శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-04-22 శుక్రవారం రాశిఫలాలు - మహాలక్ష్మీని పూజించిన ఆరాధించిన...

astro11
మేషం :- టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తులలో వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. భాగస్వాముల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో లౌక్యం అవసరం. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
వృషభం :- పెట్టుబడులకిది సత్కాలమని గమనించండి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం మంచిది.
 
మిథునం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, భాగస్వామిక ఒప్పందాల్లో మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులు మార్పుకై చేయు ప్రయత్నాల్లో జయం చేకూరుతుంది. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. రుణం తీర్చటానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు అనుకూలించగలవు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు,  ఆటోమొబైల్ రంగాల వారికి చికాకులు తప్పవు. ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్యలెదుర్కోవలసి వస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
సింహం :- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ప్రైవేటు సంస్థలలోనివారికి నిరుత్సాహం తప్పదు. ఏ విషయంలోను నిరుత్సాహం చెందక అంతా మంచికేనని సర్దుకుపోవటం శ్రేయస్కరం. స్త్రీలకు అలంకరణలు, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
కన్య :- వ్యాపారాభివృద్ధికై చేయుకృషిలో పోటీ వాతావరణం అధికం కావటంతో ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామికి అన్ని విషయాలు తెలియచేయటం క్షేమదాయకం. బంధువుల మధ్య సయోధ్య నెలకొంటుంది. రాజకీయ నాయకులు గతంలో ఇచ్చిన హామీ వల్ల స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది.
 
తుల :- సన్నిహితుల నుండి అందిన ఒక ఆహ్వానం మీకెంతో సంతృప్తినిస్తాయి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట వంటివి తప్పవు. బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు దూరప్రాంతాల నుండి సదావశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసినగాని నిలదొక్కుకోలేరు.
 
వృశ్చికం :- స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యవసాయ, తోటల రంగాల వారికి, చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహం లభిస్తుంది.
 
ధనస్సు :- బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. ఇతరులకు వాహనం ఇచ్చేటపుడు లౌక్యం పాటించండి. సంఘంలో మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విపరీతంగా వ్యయం చేయవలసి వుంటుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
మకరం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి ధోరణి చికాకు ఆందోళన కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించండి అనుకున్నది సాధిస్తారు.
 
కుంభం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. భాగస్వామిక చర్చలలో కొత్త విషయాలు, ఒప్పందాలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. పారిశ్రామిక రంగాల వారికి చికాకులు తప్పవు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారు మీ సహాయం, సహకారాలు ఆర్జిస్తారు. వాహన చోదకులకు చిరాకులు అధికమవుతాయి. 
 
మీనం :- ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. చిట్స్, ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. స్త్రీలు ఇతరులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం.