శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (07:31 IST)

07-04-22 గురువారం రాశిఫలాలు - సాయిబాబాను ఆరాధించిన శుభం

astro10
మేషం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు స్పందన అంతగా ఉండదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారులకు, రేషన్ డీలర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం :- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఎదురు చూడకుండానే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొబ్బరి, పూలు పండ్లు చల్లని పానీయ, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మనుష్యుల మనస్తత్వం తెలిసి మసలు కొనుట మంచిది.
 
మిథునం :- వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. సభలు, సమావేశాలు, వేడుకలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. దంపతుల మధ్య దాపరికం అనర్ధాలకు దారితీస్తుంది. ముఖ్యల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రతి విషయంలోను ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
 
కర్కాటకం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధికృత, ప్రయాసలు తప్పవు. అవగాహన లేని వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిదని గమనించండి. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించండి. ముఖ్యలతో ఆంతరంగిక విషయాలను చర్చిస్తారు.
 
సింహం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు హోదా పెరగటం, కోరుకున్నచోటికి బదిలీ వంటి శుభపరిణామాలుంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కన్య :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. మీ అభిప్రాయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభించలేకపోతారు. విదేశాలలోని క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత చాలా అవసరం.
 
తుల :- మీ ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తత అవసరం. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు స్థానమార్పిడి అనుకూలిస్తుంది. ఖర్చుల విషయంలో మెలకువ వహించండి. వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, అనుకూల వాతావరణం నెలకొంటాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటం ఎదురవుతాయి.
 
ధనస్సు :- స్త్రీలు అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్నంత చురుకుగా సాగవు.
 
మకరం :- వృత్తులు, చిరు వ్యాపారులకు సామాన్యం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. పెద్దల ఆరోగ్యం కలవర పరుస్తుంది. విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించిన మంచి ఫలితాలు లభిస్తాయి.
 
కుంభం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. దూరపు బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాథ పథకాల దశగా ఉంటాయి. రావలసిన పత్రాలు చేతికందుతాయి.
 
మీనం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. కొనుగోళ్ళ విషయంలో ఏకాగ్రత వహించండి. వ్యవహార దక్షత, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. ప్రముఖుల ప్రేమయంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.