ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-04-22 శనివారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని తమలపాకులతో..

మేషం :- ఉద్యోగస్తులకు పనిభారం అధికం. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. పెద్దల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మీ రాక బంధువులకు ఆనందాన్ని ఇస్తుంది. విద్యాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలించగలవు.
 
వృషభం :- ఇంటా, బయట కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. మధ్యవర్తిత్వం వహించడం వలన మాట పడవలసి వస్తుంది. విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు. ఉభయులకు ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.
 
మిథునం :- బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన కాలం.
 
కర్కాటకం :- ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. గృహాలంకరణ అంశాలపై దృష్టి పెడతారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
సింహం :- ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. దీర్ఘకాలం వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పని భారం అధికం. స్త్రీలకు నూతన వస్తు, వస్త్ర పాప్తి కలుగుతుంది. డాక్టర్లకు నిరుత్సాహం కానవస్తుంది.
 
కన్య :- కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీ ఆలోచనలు పంచుకోనే వారి కోసం మనసు తహతహలాడుతుంది. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. బహిరంగ సభలు. బృందా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
తుల :- మీరు తలపెట్టిన పనులు కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణాలు మెళుకువ అవసరం. వృత్తి వ్యక్తిగత నిర్ణయాల పట్ల సమన్వయం పాటించండి. ఉద్యోగస్తులకు వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి.
 
వృశ్చికం :- ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపం, తోటి వారి సహకారం లభిస్తుంది. పెరిగిన ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచటం మంచిది. వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు నెలకొంటుంది. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. చర్చలు, ఇష్టాగోష్ఠులలో పాల్గొంటారు. రావలసిన ధనం అందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. గృహంలో ఏవన్నా వస్తువులు పోవుటకు ఆస్కారం కలదు, జాగ్రత్త వహించండి.
 
మకరం :- ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. వృత్తి వ్యక్తిగత నిర్ణయాల పట్ల సమన్వయం పాటించండి. దైవ, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు.
 
కుంభం :- స్త్రీలు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు సంతృప్తి, పురోభివృద్ధి. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలనిస్తాయి. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
మీనం :- స్త్రీలకు బంధువర్గాల నుండి వ్యతిరేకత, ఆరోగ్యంలో చికాకులు అధికం కాగలవు. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ రాబడికిమించటం వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు.