ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-04-22 శుక్రవారం రాశిఫలాలు - పార్వతిదేవిని పూజించిన మీ సంకల్పం....

మేషం :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. గృహ నిర్మాణం, మరమ్మతులు వాయిదా పడతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యం గురించి అధికంగా ఆందోళన చెందుతారు.
 
వృషభం :- వాణిజ్య ఒప్పందాలు, భాగస్వామిక చర్చలలో అనుకూలత లుంటాయి. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనం ఏ మాత్రం నిలువ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు.
 
మిథునం :- వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధికృత మినహా ఆర్థిక సంతృప్తి ఉండదు. ప్రయాణాలు, తీర్థ యాత్రలలో అసౌకర్యానికి గురవుతారు. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. రావలసిన మొండి బాకీలు సైతంవసూలు కాగలవు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహరాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి.
 
కర్కాటకం :- ప్రేమికులకు మధ్య అవగాహనా లోపం వల్ల ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. ఉద్యోగస్తులు విధినిర్వహణలో సమర్థత కనబర్చి అధికారుల గుర్తింపు పొందుతారు. మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. భాగస్వామ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తిన ఓర్పు, నేర్పుతో పరిష్కరించండి.
 
సింహం :- విదేశీ వస్తువుల పట్ల ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. ఉద్యోగస్తుల శ్రమ, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని ఖర్చుల వల్ల చేబదుళ్ళు తప్పవు. వృత్తుల్లో వారికి ప్రోత్సాహకరంగా ఉండగలదు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. కాలాన్ని పోనీయకుండా విద్యను, ధన సంపాదనను చేయాలి.
 
కన్య :- గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. ధర్నాలు, భూ పోరాటాలు వంటి సమస్యలు ప్రభత్వాలు ఎదుర్కోవలసి వస్తుంది. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. పుణ్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
తుల :- ఆర్థికంగా పురోభివృద్ధి కానవస్తుంది కళాకారులకు, రచయిలు, అంతరిక్ష పరిశోధకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానరాగలదు. ఆశయ సాధనే అత్యున్నత లక్ష్యంగా బాధ్యతగా భావించాలి.
 
వృశ్చికం :- సినీ కళాకారుల వల్ల రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. నూనె, పెట్రోలు, డీజిల్ వ్యాపారస్తులకు గణనీయమైన అభివృద్ధి కానరాగలదు. ఎప్పటి నుండో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. స్త్రీల ఆరోగ్యము మందగిస్తుంది.
 
ధనస్సు :- విద్యార్థులు విదేశాలు వెళ్ళాలనే యత్నాలు నెరవేరగలవు. ఊహించని ఖర్చులు, చెల్లింపులవల్ల ఆటుపోట్లు తప్పవు. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం వల్ల ఊహించని చికాకులకు లోనవుతారు. వైద్య రంగాలలో వారికి అనుకోని అభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వెళ్తారు.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. రాబడికి మించిన ఖర్చులెదుర్కుంటారు. కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టటానికి యత్నిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలలో వారికి అశాంతి, చికాకులు అధికము కాగలవు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కుంభం :- ఇన్వెర్టర్, జనరేటర్, ఎ.సి. మెకానికల్ రంగాల్లో వారు ఆర్థికంగా ఒకడుగు ముందుకు వేస్తారు. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు తప్పవు. కోళ్ళ, మత్స్య గొర్రెల వ్యాపారస్తులకు సామాన్యమైన అభివృద్ధి ఉండగలదు. ఆకస్మిక బదిలీల వల్ల ఆందోళన అధికమవుతుంది. బంధువులను కలుసుకుంటారు.
 
మీనం :- మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపననలు అనుకూలిస్తాయి. విదేశాలు వెళ్ళాలనే మీ ఆలోచన క్రియారూపంలో పెట్టండి. హామీలు ఉండటంవల్ల, ధనం ఇవ్వటం వల్ల అశాంతి, చికాకులు తప్పవు. నూతన వ్యక్తుల పరియచం మీకు ఎంతో సంతృప్తి నివ్వగలదు.