1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today Daily Astrology dated on 31th March'2022

31-03-2022 గురువారం రాశిఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం...

Daily Horoscope
మేషం :- ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. రావలసిన ధనం కొంత మొత్తమైనా చేతికందుతుంది. మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
 
వృషభం :- కొబ్బరి, పండ్ల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు నిరుత్సాహం తప్పదు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. విద్యార్థినులు కొత్త విషయాల పట్ల ఏకాగ్రత, ఉత్సాహం కనబరుస్తారు.
 
మిథునం :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. ముందుగా ఊహించిన ఖర్చులు కావటంతో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
కర్కాటకం :- ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య ఏకీభావం లోపిస్తుంది. స్త్రీలు చుట్టుపక్కల వారి నుండి గౌరవం, ఆదరణ పొందుతారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వస్త్ర, కళంకారి, బంగారు, వెండి, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. 
 
సింహం :- ఐరన్, సిమెంటు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. క్రయ విక్రయాలు వాయిదా పడుట మంచిది. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో అందరినీ ఆకర్షించగలుగుతారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి.
 
కన్య :- ప్రముఖులతో ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి.
 
తుల :- స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఓర్పుతో వ్యవహరించడంవల్ల ఒక సమస్య పరిష్కారమవుతుంది.
 
వృశ్చికం :- మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. కాంట్రాక్టర్లు పనివారి వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. గొప్పగొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి.
 
ధనస్సు :- స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థినులకు ఏకాగ్రతా లోపం అధికమవుతుంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులవల్ల సమస్యలు తప్పవు. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. స్త్రీలకు పనిభారం అధికం కావడంతో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలో వారికి ఊహించని చికాకులు తలెత్తుతాయి.
 
కుంభం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలు తమ ఏమరపాటుతనం వల్ల విలువైన వస్తువులు జారవిడుచుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. అలంకారాలు, వస్త్రాలు, విదేశీ వస్తువులు పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి.
 
మీనం :- కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. మీ పెద్దల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. 
About Writer
రామన్
తర్వాతి కథనం
శ్రీవారి భక్తులకు శుభవార్త - అర్జిత సేవల్లో భక్తులకు అనుమతి