శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-04-22 శనివారం రాశిఫలాలు - నవగ్రహస్తోత్ర పారాయణ చేయడం వల్ల...

astro12
మేషం :- వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. బ్యాంకు వ్యవహారాలో మెళుకువ అవసరం. ప్రముఖులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విదేశీ వస్తువుల పట్ల ప్రజలు ఆసక్తి అధికంగా కనబరుస్తారు. స్త్రీల ఆరోగ్యం కొంతమేర మెరుగు పడుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
వృషభం :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. సంఘవిద్రోహక చర్యల వల్ల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతారు. ప్రయాణాలలో అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వటం మంచిది కాదు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, వాహనం వ్యాపారులకు కలిసి వచ్చేకాలం.
 
మిథునం :- ఉద్యోగస్తులకు అధికారుల గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. గృహం ఏర్పరచుకోవాలనే కోరిక నెరవేరుతుంది. స్త్రీలకు ఆహ్వానాలు, వస్త్ర, వస్తులాభం వంటి శుభ ఫలితాలుంటాయి. వీరికి టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ఖర్చులు, రావలసిన ధనం వసూలులో కించిత్ ఇబ్బంది తప్పదు.
 
కర్కాటకం :- ఆదాయ, వ్యయాలు సంతృప్తిని ఇస్తాయి. వస్త్రాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కోర్టు పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
సింహం :- ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి. దైవ, శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించిన సత్ఫలితాలు పొందుతారు.
 
కన్య :- ఆస్తి పంపకాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది. స్త్రీలకు ఆభరణాలు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. విద్యార్థులలో కంటే విద్యార్థినుల్లో చురుకుదనం అధికంగా ఉంటుంది. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు.
 
తుల :- ప్రభుత్వపరంగా రుణమాఫీలు, సబ్సిడీలు అధికంగా ఉంటాయి. దంపతుల మధ్య కలహాలు, ప్రశాంతత లోపం వంటి చికాకులు ఎదురవుతాయి. ఆత్మీయుల ద్వారా కీలకమై విషయాల గ్రహిస్తారు. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- ప్రభుత్వ ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువుల చేజారిపోతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యతేగాని ఆర్థిక స్థితి ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. మీ సంతానం ఉన్నత స్థాయిలో స్థిరపడతారు.
 
ధనస్సు :- రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు, గృహస మస్యలు పరిష్కారం కాగలవు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. రక్షణ రంగంలో వారికి ఇది పరీక్షా సమయం.
 
మకరం :- లౌక్యంగా వ్యవహరించటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. శతృవులపై విజయం సాధిస్తారు. ఖర్చులు పెరగటంతో రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. ఆహార, ఆరోగ్యంలో మెలకువ అవసరం. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షలలో విజయం సాధిస్తారు.
 
కుంభం :- వైద్యులకు, ఏకాగ్రత చాలా అవసరం. బంధు మిత్రుల కలయిక వలన నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. మీ సంతానం కోసం విరివిగా ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలలలో ఒడిదుడుకులు సమర్థంగా ఎదుర్కొంటారు. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
 
మీనం :- మొండి బాకీలు వసూలు కాగలవు. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయంకావడంతో వారిలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల గుర్తింపు లభిస్తుంది. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటాం వీరిపై అధికారిక దాడులు జరిగే అస్కారం ఉంది.