గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఏప్రియల్ 2022 (11:05 IST)

ఏపీ మంత్రి రోజాపై నోరు జారిన తమిళ మంత్రి: అవాక్కైన తమిళనాడు అసెంబ్లీ

Roja-Jagan
ఏపీ నూతన పర్యాటక శాఖామంత్రిగా ఎంపికైన ఆర్కే రోజాపై తమిళనాడు అసెంబ్లీలో మంత్రి వేలు నోరు జారారు. ఆయన చెప్పిన మాటలకు తమిళనాడు అసెంబ్లీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు అవాక్కయ్యారు. ఇంతకీ మంత్రి వేలు ఏమన్నారో చూద్దాం.

 
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి వేలు మాట్లాడుతూ... సీఎం స్టాలిన్ పాలనను దేశంలో అనేకమంది మెచ్చుకుంటున్నారన్నారు. ఏపీ పర్యాటక శాఖామంత్రిగా వున్న రోజా స్టాలిన్ పాలనపై గొప్పగా మాట్లాడారని చెప్పారు. ఇలా చెప్తున్న సందర్భంలో రోజా తెలుగుదేశం పార్టీలో వున్నారని చెప్పడంతో సభలోని వారంతా అవాక్కయ్యారు.

 
వెంటనే పక్కనే వున్న సభ్యులు రోజా వున్నది వైసిపిలో అని చెప్పడంతో.... అవునా. .. అంటూ తన ప్రసంగాన్ని సరిచేసుకుని మళ్లీ కొనసాగించారు. కాగా వేలు స్పీచ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.