శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (18:45 IST)

రాజీనామా చేసిన ఏపీ మంత్రులు.. రాత్రికి రాత్రే ఆమోదం

ys jagan
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ మంత్రుల చివరి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులతో సీఎం జగన్ చర్చించారు.
 
అనంతరం మంత్రులు రాజీనామాలు చేశారు. సీఎం జగన్‌కు మంత్రులు రాజీనామా లేఖలు అందజేశారు. సీఎం జగన్ మంత్రుల రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపనున్నారు. ఈ రాత్రికే మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందే అవకాశముంది.
 
దాదాపు మంత్రులంతా దీని కోసం మానసికంగా సిద్ధమయ్యారు. 2019 కేబినెట్ ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ రెండున్నరేళ్ల తరువాత మంత్రులు మారుతారని స్పష్టం చేశారు. ఈనెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  
 
విశ్వసనీయ సమాచారం మేరకు ... ప్రస్తుత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజులలో ముగ్గురు లేదా నలుగురు 11 న మళ్లీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
కొత్త మంత్రులు ఎవరన్న విషయాన్ని ఈ నెల 9 లేదా 10 ఉదయం వరకు గోప్యంగానే ఉంచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం.