గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (11:21 IST)

చెంపదెబ్బ ఎఫెక్ట్.. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా..విల్ స్మిత్

ప్రతిష్ఠాత్మక సినీ వేడుక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ నటుడు విల్‌ స్మిత్‌.. వ్యాఖ్యాత క్రిస్‌ రాక్‌పై చేయి చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మోషన్‌ పిక్చర్‌ అకాడమీకి విల్ ​స్మిత్​.. శుక్రవారం రాజీనామా చేశారు. బోర్డు ఎలాంటి శిక్షలు వేసినా దానికి తాను అంగీకరిస్తానని తెలిపారు. 
 
ఆస్కార్ అవార్డు వేడుకలో ప్రవర్తించిన విధానం షాకింగ్‌గా బాధాకరంగా వుందని అందుకే అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. బోర్డు సభ్యులు తీసుకునే ఎలాంటి చర్యలకైనా నేను సిద్ధం. తన ప్రవర్తనకు సంబంధించిన ఎలాంటి శిక్షలు వేసినా వాటన్నంటినీ పూర్తిగా అంగీకరిస్తానని తెలిపాడు. 94వ అకాడమీ అవార్డుల వేడుకలో నా ప్రవర్తన క్షమించరానిదని వెల్లడించాడు.