శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (15:39 IST)

మూడు రాజధానులకే మేం కట్టుబడి వున్నాం, చట్టాలు చేసేది అసెంబ్లీనే: బొత్స

ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపధ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి వుందనీ, అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని చెప్పారు.

 
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది సీఎం జగన్ మోహన్ రెడ్డి అభిమతమన్నారు. అందుకోసమే ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐతే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి మేలు చేసేందుకే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు.

 
చట్టాలు చేసేందుకే అసెంబ్లీ, పార్లమెంటు వున్నాయంటూ చెప్పారు. మరి కొత్తగా మూడు రాజధానుల బిల్లును లోపాలను సరిచేసి మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెడతారేమో చూడాల్సిందే.