సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (09:00 IST)

ఏపీలో కొత్త జిల్లాలు.. వాటి రాజధానులు ఇవే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచనుంది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఉగాది నాటికి కొత్త జిల్లాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. 
 
మరోవైపు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఏయే పేర్లతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారన్న ఉత్కంఠత ప్రతిఒక్కరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలు, వాటి రాజధానుల వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖపట్టణం -  విశాఖపట్టణం
అనకాపల్లి - అనకాపల్లి
శ్రీకాకుళం - శ్రీకాకుళం
విజయనగరం - విజయనగరం
మన్యం జిల్లా - పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు - పాడేరు
తూర్పుగోదావరి -  కాకినాడ
కోనసీమ - అమలాపురం
రాజమహేంద్రవరం - రాజమహేంద్రవరం
నరసాపురం - భీమవరం
పశ్చిమ గోదావరి - ఏలూరు
కృష్ణా - మచిలీపట్నం
ఎన్‌టీఆర్ జిల్లా - విజయవాడ
గుంటూరు - గుంటూరు
బాపట్ల - బాపట్ల
పల్నాడు - నరసరావుపేట
ప్రకాశం - ఒంగోలు
ఎస్‌పీఎస్ నెల్లూరు - నెల్లూరు
కర్నూలు - కర్నూలు
నంద్యాల - నంద్యాల
అనంతపురం - అనంతపురం
శ్రీ సత్యసాయి జిల్లా - పుట్టపర్తి
వైఎస్సార్ కడప - కడప
అన్నమయ్య జిల్లా - రాయచోటి
చిత్తూరు - చిత్తూరు 
శ్రీ బాలాజీ జిల్లా - తిరుపతి