మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (13:55 IST)

ఏపీలో ఐఏఎస్ అధికారులు బదిలీ

ఏపీలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.  ఈమేరకు సుమారు 8 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్ బాధ్యతలు స్వీకరించనుండగా, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా రంజిత్ బాషా త్వరలోనే విధుల్లో చేరనున్నారు. 
 
ఇక ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఈవోగా ఎన్వీ రమణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా  ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్‌గా హిమాన్షు కౌశిక్ కుఅదనపు బాధ్యతలుఅప్పగించారు. ఇక సోషల్ వెల్ఫేర్  స్కూల్స్ సొసైటీ సెక్రెటరీ‌గా ITS అధికారి పవన్ మూర్తి నియమితులయ్యారు.