1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. 55 South Central Railway Trains Stand Cancelled For Another Week

కరోనా మహమ్మారి దెబ్బకు 55 రైళ్లను రద్దు చేసిన ద.మ.రై.

South Central Railway
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చాలా అధికంగా ఉంది. ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే (దమరై) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్ ఆధ్వర్యంలో నడిచే రైళ్లలో 55 రైళ్లను రద్దు చేసింది.
 
నిజానికి ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తొలుత ప్రకటించారు. అయితే, కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో ఇపుడు నిర్ణయం మార్చుకుని ఈ నెలాఖరు వరకు ఈ రైళ్లను రద్దు చేశారు.
 
రద్దు చేసిన రైళ్లలో తిరుపతి, విజయవాడ, కర్నూలు, విజయవాడ, గుంతకల్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లతో పాటు తమిళనాతు, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు నడిపే రైళ్లు కూడా ఉన్నాయి. ఈ రద్దు చేసిన రైళ్లలో అత్యధికంగా ప్యాసింజర్ రైళ్లు ఉండటం గమనార్హం.
తర్వాతి కథనం
జనవరి 25 : నేడు 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం