శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (17:59 IST)

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు బీకాం డిగ్రీ పూర్తిచేయలేదా?

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అశోక్ బాబు చిక్కుల్లోపడ్డారు. ఈయన బీకాం డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొంటూ ఆయనపై సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అశోక్ బాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో అవాస్తవాలు పేర్కొన్నారంటూ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించాలని గతేడాది లోకాయుక్త ఆదేశించిన విషయం తెల్సిందే. 
 
దీంతో రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు అశోక్ బాబుపై ఐపీసీ 477, 420, 465 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన బీకాం డిగ్రీ పూర్తిచేయకుండానే నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చారని, సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం అందించారని అభియోగాలు నమోదు చేశారు. 
 
డిగ్రీ చదివినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు తెలిపారు. పైగా, ఈయన సర్వీసు రికార్డులను కూడా తారుమారు చేశారన్న ఆరోపణలపై కూడా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.