1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Covid News Live Updates: India reports less than 3 lakh Covid Cases

దేశంలో 3 లక్షలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

Covid News Live Updates
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ, మంగళవారం విడుదల చేసిన ప్రకటన మేరకు ఈ కేసుల సంఖ్య 2.5 లక్షలకు చేరుకున్నాయి. సోమవారం లెక్కలతో పోల్చితే మంగళవారం 50 వేలు తక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ముఖ్యంగా, కరోనా పాజిటివిటీ రేటు బాగా తగ్గిందని తెలిపింది. 
 
తాజా ప్రకటన మేరకు దేశవ్యాప్తంగా 2,55,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసులు 3,97,99,202కు  చేరుకున్నాయి. ఇందులో 22,36,842 యాక్టివ్ కేసులు ఉండగా 4.90.462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, ఆది, సోమవారాల్లో కలిపి 614 మంది చనిపోయారు. 2,67,753 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులే ఉండటం గమనార్హం. బీఎంసీ పరిధిలో 280 మంది వద్ద సేకరించిన శాంపిల్స్‌ను పరిశీలించగా ఇందులో 89 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌గా గుర్తించారు. కేవలం 8 శాతం మాత్రమే డెల్టా వేరియంట్స్, 3 శాతం డెల్టా వైరస్, ఇతర లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వంతెనపై నుంచి కిందపడిన కారు - ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి