గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (10:10 IST)

ఐదో రోజూ 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. వరుసగా ఐదో రోజు కూడా మూడు లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం ఈ కేసుల నమోదులో కాస్త తగ్గుముఖం కనిపించింది. ఆదివారం కంటే సోమవారం 27469 పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ మేరకు ప్రస్తుతం దేశంలో 03,06,064  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో కొత్తగా 439 మంది మరణించారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,43,328కి చేరింది. ఇందులో 3,68,04,145 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, 4,89,849 మంది ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.