సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (07:59 IST)

సఫారీ గడ్డపై టీమిండియా పరాజయం పరిపూర్ణం

భారత క్రికెట్ జట్టు పరాజయం పరిపూర్ణమైంది. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా తొలుత టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ఇపుడు వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆదివారం జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా నిర్దేశించిన 287 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 283 పరుగులకే భారత ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. 
 
కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ ఆటగాళ్లు 49.5 ఓవర్లో 287 పరుగులు ఆలౌట్ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతంగా ఆడి సెంచరీ బాదాడు. మొత్తం 130 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేశాడు. అలాగే, మిడిల్ ఆర్డర్‌లో రాస్సీ వాన్ డర్ డసెన్ 52, మిల్లర్ 39, డ్వేస్ 20 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, దీపక్ చహర్ 2, జస్ప్రీత్ 2, చహల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 288 పరుగుల భారీ విజయలక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు ఆరంభ నుంచే తడబడ్డారు. విరాట్ కోహ్లీ 65, శిఖర్ ధవాన్ 31, దీపక్ చహర్ 54, సూర్యకుమార్ యాదవ్ 39, శ్రేయాస్ అయ్యర్ 26 చొప్పున పరుగులు చేశారు. అయితే, ఆఖరి ఓవర్‌లో 6 పరుగులు చేయాల్సి వుండగా, వికెట్లు కోల్పోవడంతో భారత్ ఔడింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, ఫెహ్లుక్వామో 3, ప్రిటోరియస్ 2, మగాలా 1, కేశవ్ మహరాజ్ 1 చొప్పున వికెట్లు తీశారు.