శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (08:24 IST)

ఏపీకి మూడు రాజధానులే.. బిల్లు ప్రవేశపెడతాం: పెద్దిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులేనని తిరుపతిలో జరిగిన మహా పాదయాత్ర ముగింపు సభపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు.  ఏపీకి మూడు రాజధానులు అన్నదే తమ నిర్ణయం అని, అందులో ఎలాంటి మార్పు లేదని మంత్రి తేల్చి చెప్పారు. 
 
సీఎం జగన్‌ను పదవి నుంచి దింపాలన్న లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ ఒకే వేదికపైకి వచ్చాయని, చరిత్రలో ఇలా ఎన్నడూ లేదని మంత్రి అన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని స్పష్టం చేశారు. నైతిక విలువలు లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, తోక పార్టీలను వెంటేసుకుని చంద్రబాబు అబద్దాలాడుతున్నారని ధ్వజమెత్తారు.