గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (18:46 IST)

తాప్సీతో కలిసి దూసుకెళ్తున్న సమంత, పాన్ ఇండియా మూవీపై చర్చలు

దక్షిణాది టాప్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ క్రేజ్ నేపధ్యంలో ఆమెతో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించాలని ఓ బడా నిర్మాణ సంస్థ చర్చలు జరుపుతోందట. ఇందుకుగాను సమంతను ముంబైకి పిలిపించి మాట్లాడుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.

సమంతతో పాటు ఈ పాన్ ఇండియా మూవీలో ఓ పవర్ ఫుల్ పాత్రను తాప్సీ పోషిస్తుందట. ప్రస్తుతం వీరిద్దరూ ఈ చిత్రంపై చర్చించుకుంటున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. మొత్తమ్మీద సమంత తన కెరీర్లో దూకుడుగా వెళ్తోంది.