శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (20:27 IST)

పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గిస్తుందా?

petrol
పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం కింద రూ.27.90, లీటరు డీజిల్‌పై రూ.21.80 ఆదాయం వస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతేడాది లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
 
ఏప్రిల్ 10వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 19 రోజుల్లో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం ఇది ఆరోసారి. మార్చి 22 నుంచి చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగిస్తున్నాయి. 
 
అలాగే దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం మరోసారి పెరగవచ్చునని సమాచారం.